మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

టెలికం రంగంలో మరో సంచలనం.. రూ.2 కే 100 ఎంబీ డేటా!

Updated: 20-11-2017 09:09:27

న్యూఢిల్లీ: టెలికం రంగంలో మరో సంచలనం. జియో కంటే అత్యంత చవగ్గా డేటా ఇచ్చేందుకు ఓ స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. రెండు రూపాయలకే రూ.100 ఎంబీ డేటాను అందించేందుకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ వై-ఫై డబ్బా రంగం సిద్ధం చేస్తోంది. ఈ సంస్థను 13  నెలల క్రితం బెంగళూరులో ప్రారంభించారు. వినియోగదారులకు చవగ్గా డేటాను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నవై-ఫై డబ్బా రెండు రూపాయలకే 100 ఎంబీ, రూ.10కి 500 ఎంబీ, రూ.20కి 1జీబీ డేటా చొప్పున టారిఫ్‌లు వసూలు చేస్తోంది. 24 గంటల వ్యాలిడిటీతో ఆఫర్లు ప్రకటించింది. ఇందుకోసం యాప్‌లు, డౌన్‌లోడ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ పేర్కొంది. ప్రీపెయిడ్ టోకెన్ల ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తోంది. మొబైల్ నంబరును వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా నిర్ధారించుకున్న తర్వాత డేటాను అందిస్తుంది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో రూటర్లు ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.