మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

వినియోగదారులకు జియో భారీ షాక్!

Updated: 02-10-2017 06:00:53

న్యూఢిల్లీ: టెలికం రంగంలోకి అడుగుపెట్టీ పెట్టడంతోనే ప్రత్యర్థులకు షాకిచ్చి అపరిమిత ఉచిత కాల్స్‌తో వినియోగదారుల మనసులు దోచుకున్న రిలయన్స్ జియో ఇప్పుడు భారీ షాకిచ్చేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ ఉచితంగా అందించిన ఉచిత కాల్స్‌పై నిబంధనలు విధించనున్నట్టు తెలుస్తోంది. రోజుకు 300 నిమిషాలు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునేలా నిబంధన విధించనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అపరిమిత ఉచిత కాల్స్ ఆఫర్ వల్ల వాయిస్ కాల్స్ దుర్వినియోగమవుతున్నట్టు గుర్తించిన జియో ఈ నిర్ణయం తీసుకుంది. చాలామంది రోజుకు 10 గంటలకుపైగా మాట్లాడుతున్నట్టు జియో గుర్తించినట్టు టెలికాంటాక్ట్ జియో ప్రియారిటీ బృందం తెలిపింది. దీని వల్ల వాయిస్ కాల్స్ ఫీచర్ పక్కదారి పడుతున్నట్టు తేలింది. అందుకనే 4జీ డేటాలానే వాయిస్ కాల్స్‌పై కూడా పరిమితి విధించనన్నట్టు తెలిపింది.  
 
జియో ప్రారంభ సమయంలో 4జీ డేటాను కూడా అపరిమితంగా ఇచ్చింది. అయితే డేటా వాడకం దుర్వినయోగమవుతున్నట్టు తేలడంతో రోజుకు 1జీబీ డేటా పరిమితిని విధించింది. ఇప్పుడు వాయిస్ కాల్స్‌పైనా ఇదే విధమైన నిబంధన తెచ్చేందుకు  సిద్ధమవుతోంది.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.