మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ.. ఖాతాదారులకు ఊరట

Updated: 25-09-2017 10:09:46

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. నెలవారీ కనీస నిల్వపై ఇప్పటి వరకు ఉన్న నిబంధనను సవరించింది. మెట్రో నగరాలు, అర్బన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు కనీస నిల్వ రూ.5వేలు ఉండగా దానిని రూ.3వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో 5 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించినట్టు అయింది. ఇక నగదు లావాదేవీలు సరిగా నిర్వహించని ఖాతాలకు విధించే జరిమానాను కూడా 20 నుంచి 50 శాతం మేరకు సవరించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 నుంచి రూ.40, మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.50 వరకు విధిస్తున్నట్టు తెలిపింది. వచ్చే నెల నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది.
 
 
 

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.