Updated: 02-11-2017 08:17:01
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నాలుగేళ్లలో 3జీ సేవలకు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ ఇండియా, దక్షిణాసియా ఆపరేషన్స్ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. మరింత డేటా సామర్థ్యంతో 4జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ తన 3జీ స్పెక్ట్రమ్ (2,100 మెగాహెడ్జ్)ను 4జీ సేవల కోసం వినియోగించుకోనున్నట్టు వివరించారు. ప్రస్తుతం దేశంలో 4జీ ఫోన్ల హవా నడుస్తోందని, దాదాపు 50 శాతం వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నుంచి 4జీ స్మార్ట్‌ఫోన్లకు మారినట్టు విట్టల్ తెలిపారు. ప్రస్తుతం చాలా సర్కిళ్లలో 4జీ సేవలను సపోర్ట్ చేసే అత్యాధునిక 3జీ పరికరాలను అమర్చినట్టు చెప్పారు. గతంలో అమర్చిన 3జీ సేవల కోసం అమర్చిన పరికరాల స్థానంలో కొత్త వాటిని అమర్చాల్సి ఉందని విట్టల్ పేర్కొన్నారు.
షేర్ :
తాజా వార్తలు