జియోకు పోటీ.. అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్
Updated:
28-02-2018 09:02:47
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి పోటీగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.448 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రోజుకు 1జీబీ 3జీ డేటా లభిస్తుంది. కాలపరిమితి 84 రోజులు. అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకోవచ్చు. కాగా, బీఎస్ఎన్ఎల్ ఇటీవల ఏడాది కాలపరిమితితో రోజుకు 1జీబీ అందించే ‘మ్యాగ్జిమమ్’ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా రూ.448 ప్లాన్‌ను ప్రకటించింది. జియో రూ.449 ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తోపాటు 91 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటాను పొందవచ్చు. ఇటువంటి ప్లాన్‌నే ఎయిర్‌టెల్ రూ.448తో ముందుకు తెచ్చింది. ఇందులో రోజుకు 1.4 జీబీతోపాటు వాయిస్ కాల్స్ అపరిమితంగా లభిస్తాయి. కాలవ్యవధి 52 రోజులు.