ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిన విజయ్ మాల్యా!
Updated:
28-03-2018 08:41:04
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. గతంలో తన ఎయిర్ లైన్స్ కింగ్‌ఫిషర్‌లో ఉద్యోగం ఇప్పించిన పింకీ లల్వానీ అనే యువతితో డేటింగ్‌లో ఉన్న మాల్యా త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నట్టు తెలుస్తోంది. దేశం నుంచి పారిపోయి లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాకు ప్రస్తుతం పింకీ అన్నీ తానై చూసుకుంటున్నారు. కోర్టు విచారణకు కూడా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. మూడేళ్లుగా డీప్ ‘లవ్’లో ఉన్న వీరిద్దరూ అతి త్వరలోనే ఓ ఇంటి వారు కాబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్ మాల్యా తొలుత ఎయిరిండియా మాజీ ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే సిద్ధార్థ్ మాల్యా. ఆ తర్వాత చిన్ననాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. తాజాగా ముచ్చటగా మూడో పెళ్లికి మాల్యా సిద్ధమయ్యాడు.