మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

స్పైస్‌జెట్ సూపర్ డూపర్ ఆఫర్.. ప్రయాణం ఫ్రీ!

Updated: 06-12-2017 08:42:34

న్యూఢిల్లీ: ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సూపర్ డూపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. పోటీ సంస్థలకు రాయితీపై టికెట్లు ఆఫర్ చేస్తుండగా అందుకు భిన్నమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. పూర్తి ఉచితంగా విమాన ప్రయాణం చేసే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. టికెట్ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి వోచర్ రూపంలో తిరిగి వెనక్కి ఇస్తూ పోటీ సంస్థలకు షాకిచ్చింది. డిసెంబరు 1న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లపై ఈనెల 1నుంచి  వచ్చే ఏడాది మార్చి 31 మధ్య ప్రయాణించవచ్చు. 
 
ఆఫర్ కావాలనుకునే ప్రయాణికులు స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని చార్జీలతో కలిపి టికెట్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేయడం పూర్తయ్యాక ఆ సంస్థకే చెందిన స్పైస్‌స్టైల్ డాట్‌కామ్ షాపింగ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి అందులోని స్టైల్ క్యాష్‌ ఆప్షన్‌లో మై అకౌంట్ సెక్షన్‌లో ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది పూర్తయిన అనంతరం టికెట్‌కు చెల్లించిన డబ్బులు మొత్తం మన స్టైల్ క్యాష్ ఖాతాలో జమ అవుతాయి. తర్వాత ఈ మొత్తంతో ఆ సైట్‌లో కొనుగోళ్లు జరపవచ్చు. ఈ మొత్తాన్ని కూడా వచ్చే ఏడాది మార్చి 31లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక  పీఎన్ఆర్ నంబరుకు ఒక వోచర్ మాత్రమే లభిస్తుంది.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.