మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

జియో ఫోన్ బుక్ చేశారా..? అయితే ఇది మీకోసమే

Updated: 21-09-2017 01:48:50

రిలయన్స్ గ్రూప్ నుంచి సంచలనాత్మక రీతిలో విడుదలైన జియో భారత టెలికం రంగాన్ని పెనుకుదుపుకు గురిచేయడం తెలిసిందే. ఆ తర్వాత, కేవలం రూ.1500 చెల్లిస్తే చాలు అత్యాధునిక సదుపాయాలున్న ఫీచర్ ఫోన్ అందిస్తామని జియో వర్గాలు కొన్ని నెలల క్రితం ప్రకటించడంతో అద్భుత స్పందన వచ్చింది. మొదట రూ.500 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవాలని, ఫోన్ డెలివరీ సమయంలో మిగతా రూ.1000 చెల్లించాలని రిలయన్స్ తెలిపింది. అలా ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి సెప్టెంబరు మొదటి వారంలో ఫోన్లు అందజేయాల్సి ఉంది. కానీ, ఊహించనంత స్థాయిలో స్పందన రావడంతో జియో వర్గాలు ఫీచర్ ఫోన్లను సిద్ధం చేయడంలో విఫలమయ్యాయట. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బుక్ చేయడంతో వారందరికీ ఫోన్లు అందజేయడం సమయాభావం వల్ల కుదరడంలేదని జియో ప్రతినిధులు తెలిపారు. కంపెనీ అందిస్తున్న సమాచారం మేరకు అక్టోబరు 1 నుంచి ఈ ఫోన్లు వినియోగదారుల చేతికందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.