Updated: 25-10-2017 11:26:41
న్యూఢిల్లీ: ఇటీవల కార్బన్ సంస్థతో కలిసి ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఎయిర్‌టెల్ తాజాగా లావాతో కలిసి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కార్బన్‌తో కలిసి విడుదల చేసిన ఫోన్‌తో పోలిస్తే ఇందులో ఫీచర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే ధరలో కూడా తేడా ఉండనుందట. కార్బన్ ఏ40 ఇండియన్ లానే డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నా పేరు ఏం పెట్టారన్నది తెలియరాలేదు. ధర రూ.1699గా ఉండే అవకాశం ఉంది. కాగా, జియోకు పోటీగా ఇటీవల ఎయిర్‌టెల్ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.1399 మాత్రమే. ఇక లావా-ఎయిర్‌టెల్ కలిసి తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు తొలుత రూ.3500 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రూ.1801 వెనక్కి వస్తుంది. అంటే మొత్తంగా ఈ ఫోన్ ధర రూ.1699కే వినియోగదారులకు లభిస్తుందన్నమాట. అయితే కంపెనీ క్యాష్‌బ్యాక్‌గా అందిస్తున్న రూ.1801ని ఎలా రిఫండ్ చేస్తుందన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ గురించి ఇటు ఎయిర్‌టెల్ నుంచి కానీ, అటు లావా నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
షేర్ :
తాజా వార్తలు