మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

హాట్‌ కేకుల్లా అమ్ముడైన ఆనర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్లు

Updated: 14-02-2018 08:58:02

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ హువేయి తాజా స్మార్ట్‌ఫోన్ ఆనర్ 9లైట్ స్మార్ట్‌ఫోన్ హాట్‌కేకులా అమ్ముడుపోయింది. అమ్మకానికి వచ్చి ఆరు నిమిషాల్లోనే మొత్తం ఫోన్లు అమ్ముడైపోయాయి. మంగళవారం మధ్యాహ్నం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో రాగా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. అతి తక్కువ ధరలోనే అత్యధిక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించినట్టు హువేయి కన్జుమర్ బిజినెస్ గ్రూప్ ఉపాధ్యక్షుడు పి.సంజీవ్ తెలిపారు. రెండు వైపులా డ్యూయల్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.
 
స్పెసిఫికేషన్లు: 5.65 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, కిరిన్ 659 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 256 జీబీల వరకు పెంచుకునే వెసులుబాటు, 13 ఎంపీ+2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్‌ ఫ్రంట్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.10,999 మాత్రమే. 

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.