మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

ఘనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కల్చరల్ మీట్

Updated: 27-01-2018 02:49:01

హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలంగాణ సర్కిల్ 2017-18 కల్చరల్ మీట్ కన్నుల పండువగా జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పిఎన్‌బి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్యాలు, పాటలు, నాటకాలు ఆకట్టుకున్నాయి. ఎం సీతారామ శర్మ, రాధికా వెంకట రామన్ యాంకర్లుగా వ్యవహరించారు. పిఎన్‌బి తెలంగాణ సర్కిల్ హెడ్ రాజీవ్ పూరి, డిప్యూటీ సర్కిల్ హెడ్ డిఎన్ అంబేద్కర్, పిఎన్‌బి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివమోహన్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేవీ రమణ మూర్తి, ఏజీఎం మక్సూద్ అలీ జ్యోతి ప్రజ్వలన చేశారు. స్వరాజ్య లక్ష్మి, రామ్మోహన్, కావ్య, ప్రవళికతో పాటు పిఎన్‌బి ఉద్యోగుల పిల్లలు రష్మీ, మనస్విని పాడిన పాటలు అలరించాయి. ప్రతిభా గౌడ్ శిష్య బృందం చేసిన నృత్యంతో పాటు పిఎన్‌బి ఉద్యోగుల పిల్లలు విశాల్, మహిత చేసిన డ్యాన్స్ ఆహుతులను ఆకట్టుకుంది. పిఎన్‌బి హైదరాబాద్ ఉద్యోగులు ప్రశాంత్, రమణ, మధుకర్, ఫణి, రాజశేఖర్, సునీల్ చేసిన పరుగోపరుగు నాటకం బ్యాంకు ఉద్యోగుల రోజువారీ జీవితాన్ని కళ్లకు కట్టింది. పిఎన్‌బి వరంగల్‌ జిల్లా ఉద్యోగులు మహ్మద్ షఫీ, కీర్తన, శ్రీకాంత్, వీరన్‌తో పాటు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కే. మాధవ మూర్తి చేసిన గుండెపోటు నాటకం కడుపుబ్బా నవ్వించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిఎన్‌బి ఉద్యగులు ఉత్సాహంగా పాల్గొనడంపై ఆర్గనైజింగ్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.