జియో మరో సంచలనం!
Updated:
31-01-2018 08:56:16
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. అతి త్వరలో అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం మీడియా టెక్, గూగుల్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఆండ్రాయిడ్ ఓరియా (గో ఎడిషన్)తో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వివిధ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్టు మీడియా టెక్ ప్రకటించింది.
జియో విడుదల చేసిన 4జీ ఫీచర్‌ఫోన్‌కు పోటీగా ప్రత్యర్థి టెల్కోలు కూడా 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేశాయి. దీంతో ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన జియో అండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్)తో పనిచేసే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి ప్రత్యర్థులను మరోమారు దెబ్బకొట్టాలని చూస్తోంది. మీడియా టెక్ ఈ విషయాన్ని ప్రకటించింది. జియోతో కలిసి చవకైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఎంటీ6739, ఎంటీ6580 పేరుతో చిప్‌సెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపింది.