మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

ఎయిర్ డెక్కన్ బ్లాస్టింగ్ ఆఫర్.. రూపాయికే విమాన టికెట్!

Updated: 13-12-2017 12:39:59

న్యూఢిల్లీ: విమానయాన రంగంలో రోజురోజుకు అధికమవుతున్న పోటీని తట్టుకునేందుకు పలు ప్రైవేటు విమానయాన సంస్థలు టికెట్లపై రాయితీలను అందిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఎయిర్ ఏషియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి సంస్థలు ఇప్పటికే ఆఫర్లు ప్రకటించగా తాజాగా దేశీయ తొలి బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్‌ డెక్కన్ మరో బ్లాసింగ్ ఆఫర్‌తో ముందుకొస్తోంది. 
 
ఎయిర్ డెక్కన్ సంస్థను 2003లో జీఆర్ గోపీనాథ్ స్థాపించారు. 2008లో ఈ సంస్థ విజయ్ మాల్యాకు చెందిన  కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో విలీనమైంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో 2012లో ఈ సంస్థ సేవలు నిలిచిపోయాయి. అయితే తాజాగా ఈ సంస్థను తిరిగి గాడిలో పెట్టాలని భావించిన గోపీనాథ్ ప్రత్యర్థి సంస్థలకు సవాలు విసురుతూ రూపాయికే టికెట్ అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రచారంలో భాగంగా అందించనున్న ఈ రూపాయి టికెట్లను పరిమితంగా ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరులో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్ సమీప నగరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్టు గోపీనాథ్ తెలిపారు.  
 
ఈనెల 22న ముంబై నుంచి నాసిక్‌కు తొలి విమానం ఎగరనుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన ‘ఉడాన్’ ధరల కంటే చవగ్గా టికెట్లు అందించనుంది. 40 నిమిషాల ప్రయాణానికి కేవలం రూ.1400 మాత్రమే చార్జీ చేయనున్నారట. ప్రారంభంలో లక్కీ ప్రయాణికులకు రూపాయికే టికెట్ ఇవ్వనున్నట్టు గోపీనాథ్ తెలిపారు. జనవరి నెలాఖరు నాటికి మిగతా మూడు చోట్ల నుంచి కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్టు గోపీనాథ్ తెలిపారు.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.