జియోకు పోటీగా ఎయిర్‌టెల్ తాజా ఆఫర్
Updated:
05-10-2017 03:21:27
ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 799 రూపాయలతో రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ ఇస్తామని ప్రకటించింది. ప్రిపెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 799తో రీఛార్జ్ చేసుకునేవారికి 28 రోజుల పాటు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 8 సిరీస్ ఫోన్లు భారత మార్కెట్‌లో విడుదలైన సందర్భంగా జియో 799 రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. దీని ప్రకారం కస్టమర్లకు రోజుకు 3జిబి డేటా, ఉచిత అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్‌ల ఆఫర్ ప్రకటించింది. దీంతో ఎయిర్‌టెల్ కూడా జియో పోటీని తట్టుకునేందుకు తాజా ఆఫర్‌ను ప్రకటించింది. టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా కస్టమర్లకు కొంత మేరకు మేలు జరుగుతోంది.