ఆసుస్ జెన్‌ఫోన్ 3 మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
Updated:
08-11-2017 08:13:12
న్యూఢిల్లీ: తైవాన్ మొబైల్ మేకర్ ఆసుస్ తన తాజా స్మార్ట్‌ఫోన్ ‘జెన్‌ఫోన్ 3 మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. గతేడాది నవంబరులో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. అప్పట్లో దాని ధర రూ.12,999 కాగా తాజాగా రూ.3వేల రాయితీని ప్రకటించింది. ఫలితంగా ఇప్పుడీ ఫోన్‌ను రూ.9,999కే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ ఫీచర్లు: 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 13 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు దేశంలోని అన్ని ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలోనూ ఈ ఫోన్ అందుబాటులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది.