మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

అమెరికాలో రక్తపాతం..

Updated: 02-10-2017 01:07:04

లాస్‌వెగాస్: అమెరికా లాస్‌వెగాస్‌లోని కాసినోలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 58మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. మ్యూజిక్ పార్టీ జరుగుతుండగా సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో సంగీత విభావరికి హాజరైన వారు భయాందోళనలతో పరుగులు తీశారు. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాల్పుల నేపథ్యంలో లాస్‌వేగాస్‌లో హై అలర్ట్ ప్రకటించారు.ఉన్మాదిని 64 ఏళ్ల స్టీఫెన్ ప్యాడాక్‌గా గుర్తించారు. మారణహోమం జరిపాక ఉన్మాది తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. మరోవైపు దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.