మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

అమెరికాలో మళ్లీ రక్తపాతం.. కాలిఫోర్నియా స్కూల్‌లో కాల్పుల మోత

Updated: 15-11-2017 09:40:52

కాలిఫోర్నియా: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని తెహమా కౌంటీలో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. దుండగుడు రాంచో తెహమా  ఎలిమెంటరీ స్కూల్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ట్రక్కుతో వచ్చి స్కూల్ గేట్‌ను ఢీ కొట్టాడు. స్కూల్‌లోపలికి కాల్పులు జరిపాడు. కాల్పులతో స్కూల్ విద్యార్ధులు, టీచర్లు వణికిపోయారు. ప్రాణభయంతో బెంచీల కింద తలదాచుకున్నారు. అయితే పోలీసులు ఎట్టకేలకూ దుండగుడిని కాల్చి చంపేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే వరుస కాల్పుల ఘటనలతో అమెరికాలో తీవ్ర భయందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఎప్పుడు ఏ ఉన్మాది ట్రక్కులతో ఢీ కొంటాడో, ఏ ఉగ్రవాది కాల్పులకు దిగుతాడోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.