మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

డాలస్‌లో యోగా సందడి

Updated: 28-06-2017 01:21:06

డాలస్: అమెరికా టెక్సాస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 300 మంది యోగా డే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ షబ్నమ్ మోద్గిల్ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలికారు. ముఖ్య అతిథులను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సెక్రటరీ కాల్వల రావ్ పరిచయం చేశారు. ముఖ్య అతిథులుగా టెక్సాస్ స్టేట్ ప్రతినిధి మ్యాట్ రినాల్డి, ఇర్వింగ్ సిటీ మేయర్ రిక్ స్టాప్‌ఫెర్, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున అమ్రిత్ పాల్, డాక్టర్ అనుపమ్ రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను వక్తలు వివరించారు. యోగాతో శరీరం రీ ఛార్జ్ అవుతుందని, మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగుతాయని డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు. యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది యోగా నిపుణుల సూచనలను అనుసరిస్తూ ప్రాణాయామం, యోగాసనాలు, ధ్యానము చేశారు. యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న వారికి మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ తరపున సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.     

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.