మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

ఏపీలో పెట్టుబడులు పెట్టండి: దుబాయ్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ సమావేశంలో చంద్రబాబు పిలుపు

Updated: 22-10-2017 09:59:01

దుబాయి: దుబాయికి గతంలో ఎలాంటి వనరులు లేవు. భూమీ సారవంతమైనది కాదు. కానీ ప్రజా సహకారంతో ప్రభుతక్వం ఈ ఎడారి దేశాన్ని భూతల స్వర్గంగా మార్చింది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి  బృందం నాలుగు 3 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని  నాలుగో రోజు దుబాయ్ చేరుకుంది. ఇక్కడి ఫోర్ సీజన్ రిసార్టులో ఏర్పాటైన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ సమావేశంలో పాల్గొని  ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో  ఆంధ్రప్రదేశ్ కు రావాలని,  పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తాము రాష్ట్రంల ఎంత మర్ధులమో, తమ రాష్ట్రంలో వ్యాపారం ఎంత సులభతరమో  మీరే వచ్చి ప్రత్యక్షంగా చూడండని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.తాము 80% ప్రజా సంతృప్తే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు  చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా మలచాలని ముందుచూపుతో కృషి చేస్తున్నట్లు వివరించారు.
అంతిమంగా ప్రజా సంతృప్తే మా లక్ష్యం. అందుకు సంతోష సూచికను ముందు పెట్టుకుని పనిచేస్తున్నామని అన్నారు.
విభజన తర్వాత తమ రాష్ట్రాన్ని ప్రతి రంగాన్ని పునాదుల నుంచి నిర్మించటం అనివార్యమైందని చంద్రబాబు వివరించారు. వాణిజ్యానికి, వ్యాపారానికి తమ రాష్ట్రంలో ఉన్న సానుకూలాంశాలను ముఖ్యమంత్రి వివరించారు. డబ్బు లేకున్నా ప్రజల భాగస్వామ్యంతో 33 వేల ఎకరాల భూసమీకరణ ద్వారా రాజధాని అమరావతి నిర్మాణానికి సమాయత్తమైనట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి 974 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉందని, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధికి బాట వేశామని చెప్పారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
సింగపూర్ ప్రభుత్వ రాజధాని నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక రచించి 6 నెలల్లో ఉచితంగా అందజేసిందని సీఎం చెప్పారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంలో ఎక్కడా రాజీపడరాదన్న దృష్టితో ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో డిజైన్లను తయారు చేయించినట్లు చంద్రాబాబు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, తమ రాష్ట్రానికి చెందిన ఐటి నిపుణుల, పారిశ్రామిక వేత్తలు  ప్రపంచమంతా ఉన్నారని తెలిపారు.
అమరావతి అభివృద్ధికి ఆకాశమే హద్దని, భారత్ కు ఏపీ లాజిస్టిక్ హబ్ ‌గా తీర్చిదిద్దుతున్నామని, దేశంలో ఎటునుంచి ఎటు ప్రయాణం చేసినా  ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉందన్నారు.  విశాఖ-చెన్నయ్, బెంగళూరు-చెన్నయ్ పారిశ్రామిక నడవలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సుదీర్ఘ, సుందర తీరం పర్యాటక రంగానికి మణిహారమని, రైతాంగానికి మరింత ఆదాయం తెచ్చే విధంగా ఉద్యాన రంగాన్న ప్రోత్సహిస్తున్నామని, పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఎమిరేట్స్ నుంచి విజయవాడకు నేరుగా విమానయాన సేవలని ప్రారంభించాలని తాను ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌ను కోరానని, అత్యంత త్వరలో ఇది కార్యరూపం ధరిస్తుందని ఏపీ సీఎం చెప్పారు. పారిశ్రామిక శాంతి, వాణిజ్య అనుకూలం వాతావరణం తమరాష్ట్ర ప్రత్యేకతలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రపంచ బ్యాంకు బృందం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు నెంబర్ వన్ ర్యాంకు ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రూ. 149 కే ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు వివరాంరు. లక్షమందితో ఒకేసారి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం సృష్టించామని, తాను త్వరలో లక్ష గృహాల యజమానులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు వివరించారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ తెచ్చామని, అవినీతికి ఆస్కారంలేని విధంగా పరిపాలన దస్త్రాలను డిజిటలైజ్ చేసి ఆన్ లైన్ లో ఉంచామని సీఎం చంద్రబాబు వివరించారు.  గ్రీవెన్స్ సెల్ ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించడానికి 500 మంది పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా 1100 నెంబర్ కు ఫోన్ చేస్తే పరిష్కరిస్తున్నామని అన్నారు. ప్రజల ఆనందం కోసం ఆనందాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నామనని, ఆనందలహరి సహా అనేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. పండుగలకు కానుకలు పంచిపెట్టడం ద్వారా వారి కళ్లల్లో ఆనందం చూడగలుగుతున్నట్లు చంద్రబాబు వివరించారు.
 
సంక్షేమానికి, అభివృద్ధికి సమప్రాధాన్యతతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్, ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.ప్రతి నెలలో ఒకరోజు బిజినెస్ లీడర్స్ ఫోరమ్ సమావేశం ఒక పర్యాయం దుబాయ్‌లో, మరో పర్యాయం అమరావతిలో నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ఫోరమ్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. జెయింట్ గ్రూప్& ఐటిసి చైర్మన్ సుధేష్ అగర్వాల్, భారత కాన్సెల్  జనరల్ విపుల్  స్వాగతం పలికారు.
 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.