మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకి.. నలుగురి దుర్మరణం

Updated: 15-06-2017 06:40:54

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గన్ మరోమారు గర్జించింది. యునైటెడ్ పార్సిల్ సర్వీస్ కంపనీ (యూపీఎస్)లో దుండుగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఓ ముగ్గురు మృతి చెందారు. దుండుగుడు అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. కాల్పులు జరిపిన దుండుగుడు యూపీఎస్ ఉద్యోగా ? కాదా? అన్న విషయం తేలలేదు. ఈ ఘటనలో ఉగ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి సహా బాధితులందరూ డ్రైవర్లేనని యూపీఎస్ హెడ్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టీవ్ గాట్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.