మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

డాలస్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళి

Updated: 05-02-2018 10:49:47

డాలస్, టెక్సాస్: ఎంతో మంది ప్రవాస భారతీయులు డాలస్ (ఇర్వింగ్) లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపిత 70వ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ పాదాల వద్ద పుష్పాలను ఉంచి ఘన నివాళి అర్పించారు. ఎస్ పి నాగ్రాత్ అనే స్థానిక గాయకుడు గాంధీజీకి ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారామ్ కీర్తనను ఆలపించారు.
 
 
 
మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ స్థానిక ప్రజల సహకారంతో అతి పెద్ద గాంధీ మెమోరియల్ ను ఇక్కడ నిర్మించుకోవడం, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చూపడానికి అవకాశం కలిగిందని, గాంధీజీ సేవలను స్మరించుకోవడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 
 
 
 
గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గాంధీజీ 70 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ ఆయన సిద్ధాంతాలు, ఆశయాలతో మనందరి మధ్య ఎప్పటికీ సజీవంగానే ఉంటారని అన్నారు. దేశ స్వాతంత్ర సమపార్జనలో దాదాపు 32 సంవత్సరాల తన జీవతాన్ని అంకితం చేసి లక్షలాది ప్రజలను నిరంతరం చైతన్య పరచి, అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించిన తీరు అనితర సాధ్యం అని, ప్రవాస భారతీయులుగా మనమందరం గాంధీ చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం ఉండే ఒక మంచి సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని అన్నారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.