మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

న్యూ జెర్సీలో ఘ‌నంగా యోగా డే

Updated: 28-06-2017 12:50:13

న్యూ జెర్సీ: అమెరికా న్యూ జెర్సీలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. భార‌తీయ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చేస్తుండ‌టం గ‌ర్వ‌కార‌ణమని కార్యక్రమానికి హాజరైన భారతీయ జనత పార్టీ ముంబై యువజన మోర్చా ప్రెసిడెంట్ మోహిత్ కాంబోజ్ చెప్పారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని, ప్ర‌పంచ‌శాంతి, సామ‌రస్య సాధ‌న‌కు యోగాకు మించిన మాధ్య‌మం మ‌రొక‌టి లేద‌న్నారు. బుద్ధిని, శరీరాన్ని ఏకం చేసే శ‌క్తి ఒక్క యోగాకే ఉంద‌ని చెప్పారు. యోగాతో శారీక‌ర ఆరోగ్యంతోపాటు మాన‌సిక వికాసం కూడా సాధ్య‌మ‌నే విష‌యం నేడు ప్ర‌పంచం గుర్తించింద‌న్నారు. యోగా అనేది ఒక ప్రాంతానికో లేదా ఒక మ‌త విధానానికో సంబంధించింది కాద‌నే విష‌యాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల‌వారూ తెలుసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉడ్‌బ్రిడ్జ్ మేయర్‌తో పాటు 750 మంది పాల్గొన్నారు. అందరూ యోగా నిపుణుల సూచనల ప్రకారం యోగాసనాలు వేశారు. హిందూ స్వయం సేవక్ అమెరికా, కాన్సులేట్  జనరల్ అఫ్ ఇండియా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఏకల్ విద్యాలయ, ఇండియన్ బిజినెస్ కమ్యూనిటీ, సేవ అమెరికా, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇషా యోగ, సహజ యోగ, సేవా ఇంటర్నేషనల్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా, విహంగం యోగ, అమెరికన్ తెలుగు అసోసియేషన్, కమ్యూనిటీ లోకల్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిమేష్ దీక్షిత్, గణేష్, కేశవ్ దేవ్‌, రఘు, అభిమన్యు, రఘు రామ్, పూస్ఫజ్, విజయ్ మల్లంపాటి, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్, హరి, దీపు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.