మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య

Updated: 08-05-2017 10:41:00

న్యూయార్క్: సిగరెట్లు విక్రయించేందుకు నిరాకరించిన భారతీయుడు అమెరికాలో దారుణహత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని కపుర్తలకు చెందిన జగ్జీత్ సింగ్(32) ఏడాదిన్నర క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఓ కన్వీయన్స్ స్టోర్‌లో క్లర్క్‌గా చేరాడు. శుక్రవారం ఆయన పనిచేస్తున్న స్టోర్‌కు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సిగరెట్లు కావాలని అడిగాడు. దీంతో జగ్జీత్ సింగ్ ఐడీ కార్డు చూపించమని సదరు వ్యక్తిని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి సిగరెట్లు ఇచ్చేది లేదని జగ్జీత్ తేల్చి చెప్పాడు.
 

దీంతో అక్కడిని కోపంగా వెళ్లిపోయిన ఆగంతకుడు అరగంట తర్వాత వచ్చి షాపు మూసేస్తున్న జగ్జీత్ దగ్గరికి వెళ్లి దాడి చేశాడు. కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. దీంతో జగ్జీత్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమెరికా భారతీయులు హత్యకు గురికావడం వారంలో ఇది మూడో ఘటన. గత బుధవారం శాన్‌జోస్‌లో భారత సంతతికి చెందిన నరేన్ ప్రభు, అతని భార్యను వారి కుమార్తె మాజీ బాయ్‌ఫ్రెండ్ కాల్చి చంపాడు. భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు, హత్యలపై అక్కడి ఎన్నారైలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.