మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

జగిత్యాల కుర్రాడికి సౌదీ ఎయిర్‌పోర్టులో షాక్!

Updated: 05-06-2017 08:00:12

హైదరాబాద్: ఎన్నో ఆశలతో ఇంటిముఖం పట్టిన జగిత్యాల కుర్రాడికి సౌదీ అరేబియా విమానాశ్రయంలో షాకింగ్ ఘటన ఎదురైంది. భారత రాయబార కార్యాలయం నుంచి ఎగ్జిట్ పేపర్లు తీసుకుని ఆనందంగా విమానాశ్రయానికి చేరుకున్న జగిత్యాలకు చెందిన దాసరి మధుసూదన్‌ను సౌదీ కాఫిల్ (యజమాని) తన వికృత చర్యతో అడ్డుకున్నాడు. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమైన అతడి ఆశలను చివరి క్షణంలో ఆవిరి చేశాడు. అతడిపై దొంగతనం నేరం మోపి విమానం ఎక్కకుండా ఆపేశాడు. ‘‘నాపైన దొంగతనం నేరం మోపడంతో నన్ను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు’ అని మధుసూదన్ తెలిపాడు. తనపై మోపిన నేరం గురించి తెలిసి షాక్ అయినట్టు పేర్కొన్నాడు. తాను అక్కడి నుంచి బయట పడేందుకు సాయం కోసం అర్థించాడు. జగిత్యాల జిల్లా గోపాలపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన మధుసూదన్ గతేడాది జనవరి 7న డ్రైవర్ ఉద్యోగం కోసం ఏజెంట్ సాయంతో సౌదీ వెళ్లాడు. ఏప్రిల్ 2016లో చిన్న ప్రమాదం జరగ్గా యజమాని తనను చావబాదడంతో తాను పారిపోయినట్టు తెలిపాడు. మధుసూదన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి తెలిసిన వాళ్ల వద్ద ఉన్నానని పేర్కొన్నాడు. దీంతో కాఫిల్ తనపై కారు దొంగతనం మోపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ తాను కారు దొంగతనం చేస్తే ఏడాదిపాటు అతను ఎందుకు ఆగాల్సి వచ్చిందని ఆరోపించాడు. తప్పుడు ఆరోపణలతో తనను భారత్ వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నాడు. తాను భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించానని, అయితే తనపై కేసు ఉండడంతో ఏమీ చేయలేమని చెప్పారని పేర్కొన్నాడు. తనకు సాయం చేసేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు.

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.