విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కోహ్లీ, మిథాలీ రాజ్
Updated:
11-04-2018 07:28:48
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీకి ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. అలాగే, మహిళల విభాగంలో టీమిండియా మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైంది. వీరితోపాటు గతేడాది ప్రపంచకప్ గెలుచుకున్న ఇంగ్లండ్ మహిళల జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌విమెన్ హీదర్ నైట్, అన్య, నాట్ స్కీవర్‌లకు ఈ అవార్డు దక్కింది.
గతేడాది కోహ్లీ టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో కలిపి 2818 పరుగులు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ గతేడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది. వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.