మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

అజ్ఞాతవాసి విడుదల సందర్భంగా ఫ్యాన్స్‌కు పవన్ సందేశం

Updated: 04-01-2018 11:13:32

అజ్ఞాతవాసి పెద్ద ఎత్తున విదేశాల్లో విడుదల అవుతున్న సందర్భంగా ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సందేశమిచ్చారు. విదేశాల్లో ఉంటోన్న అభిమానులను ఉద్దేశించి వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. విదేశాల్లో ఉంటూ స్థానికతను, ప్రత్యేకతను చాటుకుంటోన్న తెలుగువారినందిరినీ అభినందిస్తున్నానని చెప్పారు. ఆత్మగౌరవం దెబ్బతినకుండా అక్కడ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారంటూ కీర్తించారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే విషయం మరవొద్దని పవన్ గుర్తు చేశారు. జనవరి పదిన ఈ సినిమా విడుదల కానుంది. కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు. సంగీతం అనిరుధ్. కొడకా కోటేశ్వరరావు పాటను పవన్ స్వయంగా పాడారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. కోట్ల మంది ఇప్పటికే ఈ పాటను వీక్షించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగువారి నోటి వెంట ఇదే పాట వస్తోంది. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.