రుణమాఫీతో రైతులను తమవైపు తిప్పుకున్న కర్ణాటక బిజెపి
Updated:
04-05-2018 12:57:37
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపి మేనిఫెస్టో విడుదల చేసింది. వ్యవసాయానికి లక్షన్నర కోట్లు కేటాయిస్తామని, రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పేద మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని తెలిపింది. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. దళిత విద్యార్ధులకు విద్యారుణాలు, విద్యార్ధులకు ఉచిత ల్యాప్టాప్ ఇస్తామని కమలనాథులు హామీలిచ్చారు. ఉద్యోగాల కల్పనకు 250 కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఆకర్షణీయంగా ఉన్నాయనే టాక్ రావడం బిజెపికి కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఫోకస్ ద్వారా రైతుల ఓట్లను కొల్లగొట్టేందుకు బిజెపి వ్యూహం రచించిందని పరిశీలకులంటున్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ హామీతో కర్ణాటక రైతాంగంలో హర్షం వ్యక్తమౌతోందని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి.