మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       జాతీయం న్యూస్

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచొద్దు.. చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

Updated: 11-04-2018 09:26:26

పెట్రోలు, డీజిల్ ధరలు పెంచొద్దంటూ కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ముడి చమురు ధరల్లో  ఇటీవల రికవరీ కారణంగా ఆ నష్టాన్ని భరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర సంస్థలు లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూపాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మంగళవారం ఇండియన్ ఆయిల్ షేర్లు ఎక్కువలో ఎక్కువగా 7.6 శాతం పడిపోయాయి. 2016 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో షేర్లు పతనమవడం ఇదే తొలిసారి. హెచ్‌పీసీఎల్ 8.3 శాతం నష్టపోయింది. 
 
ఈ ఏడాది వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్ వార్షిక ముడి చమురు అవసరాల కంటే 80 శాతానికిపైగానే దిగుమతి చేసుకుంటోంది. బ్యారెల్ చమురు ధర 50 డాలర్లు ఉండేలా చూసుకుంటున్నట్టు ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

షేర్ :

మరిన్ని జాతీయం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.