మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

ఎయిర్‌టెల్ సూపర్ డూపర్ ప్లాన్

Updated: 11-04-2018 07:12:04

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్‌తో వచ్చేసింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.249తో కొత్త  ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు 28 రోజుల కాలపరిమితితో రోజుకు 2జీబీ చొప్పున లభిస్తుంది. ఇవే బెనిఫిట్స్‌తో గతంలో రూ.349 ప్లాన్‌ను ప్రకటించింది. ఇప్పుడా ప్లాన్‌ను తాజా ప్లాన్ రీప్లేస్ చేయనుంది. అలాగే రూ.349 ప్లాన్‌లో గతంలో రోజుకు 2.5 జీబీ లభించగా ఇప్పుడు దానిని 3జీబీకి పెంచింది. 
 
రూ.249 ప్లాన్‌లో ఖాతాదారులు రోజుకు 2జీబీ చొప్పున 28 రోజులకు మొత్తం 56జీబీ 3జీ/4జీ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఉచిత నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా లభిస్తాయి. అలాగే సవరించిన దాని ప్రకారం రూ.349 ప్లాన్‌లో రోజుకు 3జీబీ 3జీ/4జీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. అలాగే మొత్తం 84జీబీ లభిస్తుంది. 
 
రిలయన్స్ రూ.198 ప్లాన్‌‌కు ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్‌ను గట్టి పోటీ ఇస్తుందని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఎయిర్‌టెల్ ఇటీవలే రూ.499తో మరో ప్లాన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. మిగతా ప్లాన్లలో లభించే బెనిఫిట్స్ అన్నీ ఇందులోనూ లభిస్తాయి.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.