మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

పవన్ విమర్శలపై స్పందించిన చంద్రబాబు

Updated: 15-03-2018 09:50:07

అమరావతి: నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, విమర్శలు చేయడంపై చంద్రబాబు స్పందించారు. టీడీపీ ముఖ్య నేతలు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఏపీ సమస్యలు, ప్రత్యేక హోదా వంటి అంశాల్ని పక్కనపెట్టి పవన్ టీడీపీని టార్గెట్ చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రాన్ని, మోదీని పల్లెత్తు మాట అనకుండా, ఎలాంటి విమర్శలు చేయకుండా.. తనపై, లోకేశ్‌పై పవన్ చేసిన విమర్శలు, ఆరోపణలు చూస్తుంటే బిజెపి వెనకుండి పవన్‌ను నడిపిస్తోందని పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరి మనిషో విశ్లేషించుకోవాలని చంద్రబాబు సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. నేడు కాకున్నా రేపు అన్ని విషయాలు బయటకొస్తాయని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. నాలుగేళ్లుగా టీడీపీ పనితీరును, విధానాలను ప్రశంసిస్తూ హఠాత్తుగా రాత్రికి రాత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు ఎంతవరకు సబబని టీడీపీ నేతలు పవన్‌ను ప్రశ్నించారు.
 
మరోవైపు పవన్ నిన్న సభలో మాట్లాడుతూ... శేఖర్ రెడ్డి ఉదంతంలో నారా లోకేశ్ అవినీతి కనపడటం లేదా అని పవన్ ప్రశ్నించారు. ఇసుక మాఫియాకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేకు కొమ్ములొచ్చాయా అని పవన్ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవడమేంటని పవన్ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల పేరిట కాపులకు, బీసీలకు టీడీపీ సర్కారు మభ్య పెడుతోందని పవన్ విమర్శించారు. నాలుగేళ్లలో టీడీపీ మాట్లాడే మూడు మాటల్లో ఆరు అబద్ధాలు కనపడుతున్నాయని పవన్ ఆరోపించారు. రాజధానికి 15వందల ఎకరాలు చాలని తనతో చంద్రబాబు స్వయంగా చెప్పారని, ప్రస్తుతమది లక్ష ఎకరాలకు విస్తరిస్తోందని పవన్ ఆరోపించారు. రాజధాని అంటే ఎత్తైన భవనాలు కాదని, ఉన్నతమైన వ్యక్తిత్వం కావాలన్నారు. టీడీపీ, వైసీపీ డబ్బులిస్తే తీసుకోండి, ోటు మాత్రం జనసేనకు వేయండని పవన్ కోరారు. ప్రతి పథకానికి చంద్రన్న పేరు పెట్టడంపై పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 14న జనసేన మ్యానిఫెస్టో విడుదల చేస్తామని పవన్ చెప్పారు. కేంద్రం అంటే తెలుగు నేతలకు భయం ఎందుకుందని పవన్ ప్రశ్నించారు. దోపిడిదారులకు మాత్రమే భయం ఉంటుందని పవన్ చెప్పారు. 
 
మరోవైపు పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. విజయవాడలో ఆందోళనలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పవన్‌కు భద్రత పెంచారు.

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.