ఆరేళ్లలో పవన్ ఎన్ని కోట్ల రూపాయల పన్ను కట్టారో తెలుసా?
Updated:
11-03-2018 09:24:02
హైదరాబాద్: ఈ నెల 14న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోబోతోన్న తరుణంలో జనసేన పార్టీ భారీగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పవన్‌కు సంబంధించి ఇప్పటి దాకా బయటకు తెలియని కొన్ని విషయాలను చిన్న చిన్న వీడియోల రూపంలో బయటపెడుతోంది. 6 సంవత్సరాలలో కథానాయకుడిగా పవన్ ఆర్జించింది 75 కోట్లు అయితే ప్రభుత్వానికి కట్టిన పన్నులు 25 కోట్లు అని వెల్లడించింది. ఇంతటి నిజాయితీ గల నాయకుడు మనకి ఎక్కడైనా దొరుకుతాడా? అంటూ చిన్న చిన్న వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.