మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

పరిటాల ఇంటికి వెళ్లిన పవన్.. స్వాగతం పలికిన శ్రీరాం

Updated: 28-01-2018 09:55:28

అనంతపురం: ఛలోరే ఛల్ పేరిట అనంతపురంలో యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిటాల ఇంటికి వెళ్లారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం పవన్‌కు స్వాగతం పలికారు. అనంతరం పవన్ మంత్రి పరిటాల సునీతతో సమావేశమయ్యారు. అనంతపురంలోని కరవు సమస్యపై చర్చించారు. సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. అనంతపురంలోని సమస్యలు అర్ధం చేసుకునేందుకే తాను పరిటాల సునీతను కలిశానని పవన్ చెప్పారు. పొత్తులపై ఎన్నికల సమయంలో మాట్లాడతానని చెప్పారు. అందరూ కలిసి వస్తేనే సమస్యలు పరిష్కరించగలమని చెప్పారు. దళారాల వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఏపీలోని సమస్యలన్నింటినీ ప్రధానికి ఇచ్చే నివేదికలో వెల్లడిస్తామన్నారు. రాయలసీమ సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తానన్నారు. అటు పరిటాల సునీత కూడా పవన్ రాకను స్వాగతించారు. ప్రజా సమస్యలను ప్రధానితో చర్చించి పరిష్కరిస్తానంటూ పవన్ ముందుకు రావడంపై సునీత హర్హం వ్యక్తం చేశారు. పరిటాల ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పవన్ తన యాత్రను కొనసాగించనున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌గా రాగిముద్ద, పల్లీ చట్నీని పరిటాల సునీత సిద్ధం చేశారు.    

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.