మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

సాయిధ‌ర‌మ్ తేజ్ చిరు, ప‌వ‌న్‌ అంత పెద్ద స్టార్ కావాలి

Updated: 07-02-2018 02:15:11

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...
 
సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ```అత్త‌కి య‌ముడు అమ్మాయికి మొగుడు` సినిమా వంద రోజుల ఫంక్ష‌న్ త‌ర్వాత ఆ రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్ష‌న్ `ఇంటిలిజెంట్‌`. ప్రేక్ష‌కులు ఆశీర్వాదం మాకు ఉంటుంద‌ని భావిస్తున్నాం. వి.వి.వినాయ‌క్‌గారు నాకు ఎంతో ఇష్ట‌మైన డైరెక్ట‌ర్‌. ఆయన్ని చూడ‌గానే హోమ్లీ డైరెక్ట‌ర్ అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవ‌కాశాన్ని ఆయ‌న నాకు ఇచ్చారు. ఆయ‌న చాలా పెద్ద డైరెక్ట‌ర్. ఇంకా ఎన్నో హైట్స్ ఆయ‌న చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను. చిరంజీవిగారి క‌మ్‌బ్యాక్ ఫిలింను డైరెక్ట్ చేసిన ఆయ‌న నాతో సినిమా చేసినందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కుల‌కు, మెగాభిమానుల‌కు ఈ సినిమా గుర్తుండి పోయే సినిమా అవుతుంది. ఒక ఆర్టిస్ట్‌కు కంఫ‌ర్ట్ జోన్‌ను క్రియేట్ చేసి..సినిమాను గ్రాండ్‌గా తెర‌కెక్కించ‌డానికి వెనుకాడ‌ని సి.క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌. చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్‌ను ఇళ‌య‌రాజా, సీతారామ‌శాస్త్రి చేతుల మీదుగా విడుద‌ల చేశాం. మంచి సినిమా తీశామ‌ని న‌మ్మ‌కంతో ముందుకెళ్తున్నాం. నా స్నేహితుడు త‌మ‌న్ ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జానీ, శేఖ‌ర్‌లు నాతో డ్యాన్స్‌ను కుమ్మించేశారు. చిరంజీవిగారు స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జెండా రెప‌రెప‌ల‌నే నా గుండె చ‌ప్పుడులుగా భావించి క‌ష్ట‌ప‌డుతుంటాను. ఎప్ప‌టికీ ఇలాగే క‌ష్ట‌ప‌డుతుంటాను. నాకు మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్‌, మెగాప‌వ‌ర్‌స్టార్‌, స్టైలిష్ స్టార్‌, వ‌రుణ్ ఇలా అంద‌రూ నాకు పంచ‌భూతాలు. మా బావ‌... బామర్ధి ఎప్పుడూ బావ మంచినే కోరుకుంటాడు. కాబ‌ట్టి.. వ‌రుణ్ సినిమా కూడా డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 10న తొలిప్రేమ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఒకేరోజు ఇద్ద‌రు మెగా హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చి హిట్ కొడితే ఆ కిక్కే వేరు. ఆ రికార్డ్ మ‌నం మిస్స‌య్యాం. మెగాస్టార్ చిరంజీవిగారు, ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు, స‌హ‌జ న‌టుడు నాగ‌బాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్‌పై నేను లేను`` అన్నారు. 
 
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``మెగాఫ్యామిలీ అభిమానులకు థాంక్స్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి ఓ రిక్వెస్ట్‌. ఆయ‌న సినిమాలు చేయ‌న‌ని అన్నారు. కానీ ఆయ‌న రాజ‌కీయంగా ఎంత ఎదిగినా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎంత పోరాడినా.. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా సినిమాలు చేయండి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమాను చూసిన వారంద‌రూ సంతోషిస్తారు. మంచి క‌థ‌ను అందించిన ఆకుల శివ‌, సినిమాట‌గ్రాఫ‌ర్ విశ్వేశ్వ‌ర్‌, ఎడిట‌ర్ గౌతంరాజుగారు, గీతం అందించిన త‌మ‌న్‌, సాహిత్యం అందించిన ర‌చ‌యిత‌లు స‌హా అంద‌రికీ థాంక్స్‌. తేజుతో చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ చేసేట‌ప్పుడు నాకు చిరంజీవిగారే గుర్తుకు వ‌చ్చారు. అలాగే రెండు మూడు స‌న్నివేశాలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా తేజు క‌న‌ప‌డేలా షూట్ చేశాను. ఎందుకంటే చిరంజీవిగారు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు క‌లిస్తే ఎలా ఉంటుందో అలా తేజు స్టైల్ ఉంటుంది. మెగా ఫ్యామిలీలో క‌ష్ట‌ప‌డేత‌త్వం ఎలా ఉందో.. తేజులో ఆ త‌త్వం క‌న‌ప‌డుతుంది. చిరంజీవిగారిలా తేజు అంద‌రినీ కలుపుకు పోతుంటాడు. కాబ‌ట్టి తేజు కూడా అన్న‌యంత, ప‌వ‌న్‌కల్యాణ్‌గారంత‌ పెద్ద స్టార్ కావాల‌ని కోరుకుంటున్నాను. మా అన్న‌య్య క‌ల్యాణ్ న‌న్ను గాజు బొమ్మ‌లా చూసుకున్నారు. నన్నెంతో బాగా కేర్ తీసుకున్నారు. ఈ సినిమా ఇంత త్వ‌ర‌గా పూర్తి కావ‌డానికి నిర్మాత‌లే కార‌ణం. సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ వంద సినిమాలు పూర్త‌య్యే వర‌కు నా జ‌ర్నీ వారితో ఉంటుంది. నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌ట్నుంచి పెద్ద డైరెక్ట‌ర్‌ని అవుతాన‌ని న‌మ్మిన‌వారిలో సి.క‌ల్యాణ్ అన్న‌య్య ఒక‌రు. ఆయ‌న రామానాయుడిగారిలా వంద సినిమాలు తీస్తారు. ఆ జ‌ర్నీలో నేను కూడా ఉంటాను. మాతో పాటు విడుద‌ల‌వుతున్న‌తొలిప్రేమ‌, మోహ‌న్‌బాబుగారి గాయ‌త్రి సినిమాలు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 
 
సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``త్రివిక్ర‌మ‌రావుగారి నిర్మాణంలో ఇళ‌య‌రాజాసంగీతంలో సీతారామ‌శాస్త్రి ర‌చించిన చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ ఎంత పెద్ద హిట్టో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఇంటిలిజెంట్ సినిమాలో మేం రీమేక్ చేశాం. ఈ చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు మావ‌య్యుల కలిసి మ‌రో మెగాస్టార్ కావాల‌నుకున్న‌ది ఈ సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. డెఫ‌నెట్‌గా ఈ సినిమా వేరు. మా సోద‌రుడు వినాయ‌క్ సినిమాను ఇర‌గ‌దీయించారు. పాట‌లు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్ చూస్తున్న‌ట్లుంటుంది. ఫిబ్ర‌వ‌రి 9న ఓ పండుగ ఉంటే, ఫిబ్ర‌వ‌రి 10న వ‌రుణ్ న‌టించిన తొలిప్రేమ మ‌రో పండుగ అవుతుంది. తేజు ఎంతో సిన్సియ‌ర్‌గా ఈ సినిమా కోసం ప‌నిచేశాడు. మా యూనిట్‌కు ఇంత మంచి సినిమా ఇచ్చిన వినాయ‌క్‌గారికి థాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 9న ఈసినిమా కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది. ఓ ద‌ర్శ‌కుడు కారు దిగగానే ..సింహం,పులి, ఎనుగులాగంభీరంగా అనిపించే వారిలో మా గురువుగారు దాస‌రిగారుంటే.. త‌ర్వాత అలా అనిపించే ద‌ర్శ‌కుడు వినాయ‌క్ మాత్ర‌మే. లోప‌ల ఎంత టెన్ష‌న్ ఉన్నా బ‌య‌ట‌కు న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తుంటాడు. మా కాంబినేష‌న్‌లో ఫ్యూచ‌ర్‌లో ఇంకా రిపీట‌వుతుంది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 
 
పార్ల‌మెంట్ స‌భ్యులు ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ - ``ప్రీ రిలీజ్ వేడుక‌నే కాదు, స‌క్సెస్ మీట్‌ను కూడా రాజమండ్రిలోనే జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. సాయిధ‌ర‌మ్ తేజ్ డాన్సుల‌ను అద్భుతంగా చేశాడు.35 ఏళ్ల క్రితం నేను, చిరంజీవిగారు క‌లిసి `మ‌న వూరి పాండ‌వులు` సినిమాలో న‌టించాం. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌ను చూస్తుంటే చిరంజీవిగారే గుర్తుకు వ‌స్తున్నారు. మామకు త‌గ్గ అల్లుడుగా సాయిధ‌ర‌మ్ నిరూపించుకుంటున్నాడు. రేపు మామ‌ను మించిన అల్లుడు కావాల‌ని కోరుకుంటున్నాను. ఎన్నో హిట్స్ మీద హిట్స్ తీస్తున్న వినాయ‌క్‌గారికి అభినంద‌న‌లు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగిన క‌ల్యాణ్ ఇప్పుడు పెద్ద నిర్మాత‌గా రాణిస్తున్నారు. మ‌రో నాలుగేళ్ల‌లో రామానాయుడుగారిని మించి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను`` అని తెలిపారు. 
 
లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ - ``సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. క‌ల్యాణ్‌గారు, వినాయ‌క్‌గారు చాలా బాగా ట్రీట్‌చేశారు. సాయిధ‌ర‌మ్ తేజ్ సూప‌ర్బ్‌గా యాక్ట్‌చేశాడు. సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.