Updated: 14-03-2018 09:28:05
లండన్: సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ ఇకలేరు. 76 సంవత్సరాల ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్టీఫెన్ హాకింగ్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారని బ్రిటన్ మీడియా తెలిపింది. కేంబ్రిడ్జ్‌లోని ఆయన స్వగృహంలో స్టీఫెన్ హాకింగ్ తుదిశ్వాస విడిచారని తెలిసింది. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా జీవించి ఉండగా కూడా ఆయన శరీరం కదిలేది కాదు. చక్రాల కుర్చీకి అతుక్కుపోయేవారు. కంప్యూటర్ సాయంతో మాట్లాడేవారు. అయితే శరీరం సహకరించకున్నా కృష్ణబిలాలపై ఆయన పరిశోధనలు సాగించారు. ఖగోళ శాస్త్రంలో అనేక ప్రశ్నలకు ఆయన పరిశోధనలు సమాధానాలు చూపాయి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా సేవలందించారు. హాకింగ్స్ రేడియేషన్, కృష్ణబిలాల రేడియేషన్‌ను ప్రతిపాదించింది ఆయనే. 1942 జనవరి 8న స్టీఫెన్ ఇంగ్లాండ్ ఆక్స్‌ఫర్డ్‌లో ఆయన జన్మించారు.
షేర్ :
తాజా వార్తలు