మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

దిష్టి తగలకుండా సన్నీలియోన్ ఫొటోలు

Updated: 14-02-2018 02:40:46

బండకిందిపల్లి: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం బండకిందిపల్లి గ్రామంలో పొలాలకు దిష్టి తగలకుండా చెంచురెడ్డి అనే ఓ రైతు సన్నీలియోన్ ఫొటోలు పెట్టాడు. ఏపుగా పెరిగిన పొలానికి దిష్టి తగలకుండా ఉండటానికి సన్నీలియోన్ ఫ్లెక్సీలను పొలానికి నాలుగువైపులా కట్టాడు. సన్నీ లియోన్ ఫ్లెక్సీలపై నన్ను చూసి ఏడవకురా అంటూ ఓ వాక్యం కూడా జత చేశాడు. దీంతో అందరి దృష్టీ పొలం మీదకు వెళ్లకుండా సన్నీలియోన్‌పై వెళ్తోందని ఆ రైతు చెబుతున్నాడు. దిష్టి సంగతి ఏమోకానీ సన్నీలియోన్ ఫొటోలను జనం వింతగా చూస్తున్నారు. తన ఫొటోలను దిష్టిబొమ్మల్లా పెట్టారనే విషయం సన్నీకి కూడా నేడో, రేపో తెలిసే అవకాశం ఉంది. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.