మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

మహేష్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో భారీ చిత్రం

Updated: 22-04-2018 03:02:38

'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌).. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఓ భారీ చిత్రాన్ని(#mahesh26) ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. 2019లో విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. రంగస్థలం హిట్ కావడంతో అదే ఊపులో సుకుమార్ దర్శకత్వంలోనే మైత్రీ మూవీ మేకర్స్ మహేశ్‌తో ఈ సినిమా ప్లాన్ చేసింది. అదే సమయంలో భరత్ అనే నేను సినిమా హిట్‌తో మహేశ్ కూడా దూకుడుపై ఉన్నాడు. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.