మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

శ్రీదేవి మరణంపై 10 అనుమానాలు

Updated: 26-02-2018 03:21:51

దుబాయ్: సినీ నటి శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె గుండెపోటుతో చనిపోలేదా? ఆమె మరణంపై కుటుంబసభ్యులు ఎందుకు నోరు విప్పడం లేదు? శ్రీదేవి సోదరి శ్రీలతకు ఆలస్యంగా ఎందుకు సమాచారం ఇచ్చారు? అసలు ఆమె బస చేసిన జుమెరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌లో ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
1, అసలు శ్రీదేవి ఎలా చనిపోయారు? 
2. గుండెపోటు వచ్చాక కుప్పకూలిపోయి బాత్‌టబ్‌లోనే ఊపిరాడక చనిపోయారా?
3. శ్రీదేవి చనిపోయిన సమయంలో ఆమె భర్త బోనీ కపూర్ ఆమె వెంట హోటల్ గదిలో లేరా? ఉంటే ఎక్కడున్నారు. ఆమె మరణించిన సమయంలో బోనీ కపూర్ భారత్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సర్‌ప్రైజ్ డిన్నర్ అంటూ బోనీకపూర్ ముంబై నుంచి దుబాయ్ వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. 
4. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె చనిపోతే ఆ తర్వాత మూడు గంటల వరకూ మెడికల్ హెల్ప్ ఎందుకు తీసుకోలేదు?
5. ఆ మూడు గంటల్లో ఏం జరిగింది? 
6. హోటల్ సిబ్బందే శ్రీదేవిని గుర్తించారా? 
7. శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదా?
8. బాత్‌రూంలోకి వెళ్లక ముందు హోటల్ గదిలో బోనీ కపూర్, శ్రీదేవి పావుగంట మాట్లాడుకున్నారనే వార్త అబద్ధమేనా? 
9. ఫిట్‌నెస్ కోసం తీసుకున్న అతి జాగ్రత్తలే ఆమె ప్రాణాన్ని తీశాయా లేక ఏదైనా కుట్రకోణం ఉందా?  
10. శ్రీదేవి లాంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీ చనిపోతే ఆమె మరణంపై 36 గంటలు గడిచినా అధికారిక ప్రకటన రాకపోవడానికి వెనుక రహస్యాలున్నాయా?
 
తమ అభిమాన నటి శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతోన్న అభిమానులు ఆమె మరణంపై వస్తోన్న అనుమానాలతో మరింత ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా అసలేం జరిగిందనే విషయంపై శ్రీదేవి కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటిస్తేనే అనుమానాలు నివృత్తి అవుతాయి.  

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.