మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

కూచిపూడి నృత్యాలతో కట్టిపడేసిన చిన్నారులు

Updated: 28-01-2018 09:50:18

హైదరాబాద్: శ్రీ నృసింహ నాట్యభారతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ 29వ వార్షికోత్సవాలు కన్నులపండువగా సాగాయి. హైదరాబాద్ మణికొండలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు ఆహూతులను అలరించాయి. కూచిపూడి యక్షగానం రూపంలో చిన్నారులు చేసిన గిరిజా కళ్యాణం నృత్యరూపకం ఆహుతులను కట్టిపడేసింది. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నాట్యగురువు యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబుకు యక్షగాన విదుమౌళి బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా వచ్చిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, డ్యాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ అక్కుల శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా ఈ బిరుదును ప్రదానం చేశారు. చిన్నారులు హేమణ్య, దీక్ష, కుందన్ కుమార్, లాస్య, పూజిత, త్రివేణి, హస్వి, జాహ్నవి, కృతిక, నీహారిక తదితరులు చేసిన నృత్య రూపకాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారులకు చదువుతో పాటు శాస్త్రీయ సంగీతం, నృత్యాలు నేర్పించడం సంతోషకరమన్నారు. పిల్లలు పాశ్చాత్య డ్యాన్స్ ల మోజులో పడకుండా ఇలా సంప్రదాయ నృత్యరూపకాలు నేర్పిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.
 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.