మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

క్రికెట్‌లో ఇలాంటి ఫిక్సింగ్ ఎప్పుడూ చూసి ఉండరు!

Updated: 31-01-2018 08:14:11

దుబాయ్: క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు అప్పుడప్పుడూ బయటపడి కలకలం రేపుతుండడం చూస్తూనే ఉన్నాం. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఈ భూతానికి బలైన వారిలో కొందరు. అయితే తాజాగా బయటపడిన ఓ ఫిక్సింగ్‌ను చూసి ఏకంగా ఐసీసీనే నోరెళ్లబెట్టింది. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్ వారంతట వారే ఔటవడం ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న విచిత్రం. ఉత్తపుణ్యానికే రనౌట్‌లు అవడం, లేని రన్‌ కోసం పరుగులు పెట్టడం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని విచిత్రాలు ఆ మ్యాచ్‌లో కనిపిస్తాయి. 
 
యూఏఈలోని అజ్మన్ వేదికగా జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. ఆటగాళ్ల తీరు అంపైర్లు కూడా విస్తుపోయారు. యూఏఈ క్రికెట్ బోర్డు స్వయంగా నిర్వహించిన అజ్మన్ ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్‌లో కనిపించిన ఈ షాకింగ్ దృశ్యాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులందరూ అవాక్కయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అయితే నోరెళ్లబెట్టింది. 
 
దుబాయ్ స్టార్స్-షార్జా వారియర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ స్టార్స్ 135 పరుగులు చేసింది. అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన  షార్జా వారియర్స్ మొత్తం క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా ఆడింది. క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు ఏదో పనున్నట్టు ఎప్పుడెప్పుడు అవుటవుదామా? అన్నట్టు ఆడారు. బంతులను కావాలని వదిలేసి స్టంపౌట్లు అయ్యారు. అవసరమైన పరుగు కోసం ప్రయత్నించి మరికొందరు అవుటయ్యారు. మరికొందరు కావాలని రనౌట్ అయ్యారు. ఇలా ఈ మ్యాచ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 46 పరుగులకే వారియర్స్ జట్టు ఆలౌట్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. షేర్ల మీద షేర్లు కావడంతో ఐసీసీకి చేరింది. దీంతో సీరియస్ అయిన ఐసీసీ విచారణకు ఆదేశించింది. అప్పటి వరకు ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించ వద్దని ఆదేశించింది.  

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.