మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్

Updated: 19-02-2018 12:40:35

ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు,. బుష్రా మనేకా అనే మహిళను వివాహమాడారు. ఈ విషయాన్ని భారత్, పాక్‌లోని ప్రముఖ వార్తా సంస్థలు నిర్ధారించాయి. అంతేకాదు ఆయన నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ పీటీఐ కూడా నిర్ధారించింది. 66 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 40 ఏళ్ల వయసున్న మనేకాను పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి మీడియాకు తెలిపారు. ఇమ్రాన్ మూడో పెళ్లి గురించి కొంత కాలంగా పుకార్లు షికారు చేశాయి. అయితే ఆ పుకార్లను ఇమ్రాన్ కొట్టిపారేస్తూ వచ్చారు. చివరకు అవే నిజమయ్యాయి. వివాహం చాలా నిరాడంబరంగా జరిగిందని, వలిమా తర్వాత ప్రకటిస్తారని పిటిఐ తెలిపింది. ఇమ్రాన్ నిఖా ఫొటోలను పీటీఐ తమ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో కూడా పోస్ట్ చేసింది. మనేకాను ఇమ్రాన్ జనవరి ఒకటినే లాహోర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నాడని పాక్ పత్రిక ఒకటి నిన్ననే రాసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రపోజ్ చేసినా పెళ్లి చేసుకోవడానికి తనకు కొంత వ్యవధి కావాలని మనేకా అడిగినట్లు వార్తలు వచ్చాయి. మనేకాకు ఖవార్ ఫరీద్ మనేకా అనే సీనియర్ కస్టమ్స్ అధికారితో గతంలోనే వివాహమైంది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనేకా అంటే తనకు గౌరవమని గతంలో ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. 
 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.