మోదీ దెబ్బకు బద్దలైన సిపిఎం కంచుకోట
Updated:
03-03-2018 03:31:23
అగర్తల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దెబ్బకు సిపిఎం కంచుకోట బద్దలైంది. త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చేసింది. ఇప్పటికే 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా 43 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని దక్కించుకుంది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సిపిఎం ప్రభుత్వానికి 16 స్థానాలు మాత్రమే లభించాయి. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సిపిఎం సర్కారును కమలనాథులు కూలదోశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు వేలాది మంది కార్యకర్తలు కొన్నేళ్లుగా కృషి చేయడం వల్లే త్రిపురలో తాజా విజయం సాధ్యమైందని బిజెపి శ్రేణులంటున్నాయి. వామపక్ష భావజానికి భారత్ చెల్లు చీటీ చెప్పిందని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా బిజెపి నేత సునీల్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. సిపిఎం ప్రస్తుతం ఒక్క కేరళలో మాత్రమే అధికారంలో ఉంది.