మొబైల్, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింకింగ్‌పై సుప్రీం తాజా ఆదేశాలు
Updated:
13-03-2018 04:40:48
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింకింగ్‌పై సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి తీర్పు ఇచ్చేవరకూ లింకింగ్‌కు తేదీని పొడిగించింది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 31లోగా అందరూ తమ ఆధార్ కార్డును మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా లింక్ చేయాల్సిందేనని గతంలో గడువు విధించారు. లేదంటే మొబైల్ ఫోన్ నెంబర్లు పనిచేయవని, బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలు కూడా నిలిచిపోతాయని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో సుప్రీం తాజాగా ఆ గడువును పెంచింది. తదుపరి తీర్పు చెప్పేదాకా గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.