జొన్నవిత్తుల పద్య వాద్య కచేరీ సీడీ ఆవిష్కరణ
Updated:
22-03-2018 04:25:46
సినీ పాటల రచయిత జొన్నవిత్తుల పద్య వాద్య కచేరీ సీడీని ఏపీ సిఎం చంద్రబాబు తమ క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ నిర్మాణంలో డైరక్టర్ వి.ఎన్ ఆదిత్య, సహ నిర్మాత కూచిభొట్ల పర్యవేక్షణలో ఈ సీడీ రూపొందింది. తెలుగు భాషాభిమానుల కోసం వినూత్నంగా జొన్నవిత్తుల పద్య వాద్య కచేరీ సీడీని రూపొందించిన బృందాన్ని చంద్రబాబు అభినందించారు.