హుస్సేన్ సాగర్‌పై తెలంగాణ అమరవీరుల స్థూపం
Updated:
21-02-2018 10:13:48
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌పై తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మూడంతస్థుల్లో దీన్ని నిర్మిస్తారు. ఒక ఫ్లోర్లో మ్యూజియం, ఆడియో విజువల్ హాల్, కన్వెన్షన్ హాల్, సమావేశాలు జరుపుకోవడానికి హాళ్లు, మరో ఫ్లోర్లో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు. టాప్ ఫ్లోర్లో జ్యోతిని ఏర్పాటు చేస్తున్నారు. దివ్వె ఆకారంలో దీన్ని నిర్మించనున్నారు. పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌పై తెలంగాణ అమరవీరుల స్థూపం హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణగా మారబోతుందని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి ఘనంగా నివాళులర్పించినట్లౌతుందని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. హుస్సేన్ సాగర్‌పై ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఎత్తైన జాతీయ జెండా కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసే హుస్సేన్‌సాగర్‌లో శుద్ధ జలాలుండేలా చూడాలని హైదరాబాదీలు కోరుతున్నారు.