మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

చిరంజీవిని సరదాగా ఇంటర్వ్యూ చేసిన సుధీర్ బాబు

Updated: 02-05-2018 02:19:53

"సమ్మోహనం" సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న  'సమ్మోహనం' చిత్రం టీజర్ ని మెగా స్టార్ చిరంజీవి డల్లాస్ (USA )లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కాసేపు సరదాగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసారు. 
ఆ విశేషాలు.. 
 
సుధీర్ బాబు: 'సమ్మోహనం'  టైటిల్ చెప్పగానే మీకేం  గుర్తొస్తుంది సర్ !
చిరంజీవి : 'సమ్మోహనం' అనగానే సరెండర్ ,ఇంకొక రకంగా మెస్మరైజింగ్ . ఫ్లాట్ అయిపోతున్నామనే  ఫీలింగ్ వచ్చింది!
సుధీర్ బాబు : పర్సనల్ క్వశ్చన్  సర్ ....  సురేఖ గారిని చూసి మీరు సమ్మోహితులు అయిన  సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
చిరంజీవి : (నవ్వుతూ) సురేఖని చుసిన ఫస్ట్ లుక్ లోనే నేను సమ్మోహితుడు అయ్యాను!
సుధీర్ బాబు : అప్పట్లో  మీ సినిమాలు రుద్రవీణ గానీ,  ఆరాధన గానీ,   ఆపద్బాంధవుడు గానీ  అచ్చ తెలుగు టైటిల్ పెట్టేవారు! 
ఆ మధ్య కాలంలో తెలుగు టైటిల్స్ మిస్ అయ్యాం !మళ్ళి  ఇప్పుడు ఆ టైపు టైటిల్స్ వస్తున్నాయి. 
చిరంజీవి : యా ! చాలా ఆనందకరమైనా  విషయం ! మొన్న రంగస్థలం, నిన్న భరత్  అనే నేను, రేపు సమ్మోహనం. 
సుధీర్ బాబు : ఇంద్రగంటి గారి సినిమాలు ఏమైనా చూసారా మీరు ?
చిరంజీవి : యా ! ఆయన  గురించి గొప్పగా విన్నాను.ఇటీవల ఆయన  తీసిన సినిమా "అమీ తుమీ " మా  ఫ్యామిలీ తో చూసాను. 
సుధీర్ బాబు : టీజర్ చుస్తే ఏమనిపించింది సర్ మీకు?
చిరంజీవి : చాలా బాగుంది. ఆ అమ్మాయి లో ఆ freshness  చూడగానే అట్ట్రాక్ట్ అయ్యాను. ముఖ్యంగా ఆ అమ్మయితో sarcastic  గా మాట్లాడుతూ, ఫ్యూచర్ లో 
40 సంవత్సరాల తరువాత ఆ అమ్మాయి ఎలా వుండబోతుందో చెప్పడం. ముఖ్యంగా ఆ డైలాగు " చర్మం ముడతలు పడి ..పళ్ళు రాలిపోయి..కాళ్ళు వంగిపోయి'' 
చాలా తమాషా గా అనిపించింది. చూస్తుంటే స్ట్రాంగ్ లవ్ స్టోరీ అనిపించింది. 
ఇంతకు కథ ఏంటి ?
సుధీర్ బాబు : ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక ఫిలిం స్టార్ మధ్య జరిగే లవ్ స్టోరీ. 
చిరంజీవి : స్టోరీ ఇంద్రగంటి గారిదే కదా !
సుధీర్ బాబు  : ఇంద్రగంటి గారిదే సర్ ! ఇంద్రగంటి గారు గోల్కొండ హై స్కూల్ టైం లో ఒక రియల్ ఇన్సిడెంట్   నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ రాశారు. 
చిరంజీవి : ఓ బ్యూటిఫుల్ ! ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీ అందరికి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.