స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించిన వైసీపీ ఎంపీలు
Updated:
06-04-2018 12:22:33
న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. స్పీకర్ ఫార్మట్‌లో తమ రాజీనామాలను సమర్పించారు. పార్లమెంట్ ఉభయసభలూ నిరవధికంగా వాయిదా పడ్డాక వైసీపీ లోక్‌సభ ఎంపీలు నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామాల లేఖలను సమర్పించారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని, సభలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని స్పీకర్ సూచించారు. అయితే తమ నిర్ణయంపై వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కోరారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ రాజీనామాలు సమర్పించిన వారిలో ఉన్నారు. ఆ తర్వాత ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేపట్టారు.