మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

నటుడు రావ్ రమేశ్ ఇంట్లో విషాదం

Updated: 07-04-2018 10:31:59

హైదరాబాద్: నటుడు రావ్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలకుమారి(స్వర్గీయ నటుడు రావుగోపాల రావు భార్య) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొండాపూర్‌లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కమలకుమారి వయసు 73 సంవత్సరాలు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. రావ్ రమేశ్ రావుగోపాలరావు కుమారుడు. పలువురు సినీ ప్రముఖులు రావు రమేశ్‌ను పరామర్శిస్తున్నారు. రావు రమేష్ తల్లి పార్ధీవ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. రావు రమేష్‌ను ఓదార్చారు. చిరంజీవి నటించిన అనేక సినిమాల్లో రావుగోపాలరావు నటించారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.