మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

రంగ స్థలం.. కలెక్షన్ల వర్షం.. అమెరికాలో బాక్సులు బద్దలు

Updated: 31-03-2018 09:03:56

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన రంగ స్థలం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంది. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. సుకుమార్, రాం చరణ్ సినిమా కోసం పని చేసిన పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 1980 నేటివిటీని ప్రతిబించించేలా సినిమాను రూపొందించారు. సినిమాకు సుకుమార్ దర్శకుడు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ ప్రధాన తారాగణం 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.