రస్సెల్ 11 సిక్సర్లతో చెలరేగినా తప్పని ఓటమి
Updated:
11-04-2018 12:40:43
చెన్నై: రస్సెల్ 36 బంతుల్లో 11 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 88 పరుగులు చేసినా కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. ఊతప్ప 29, కార్తీక్ 26 పరుగులతో 20 ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోరు చేసినా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా ఆడి గెలిచారు. చివరి ఓవర్‌లో ఒక బంతి మిగిలి ఉండగానే చెన్నై జట్టు విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. వాట్సన్ 42, రాయుడు 39, రైనా 14, ధోనీ 25, బిల్లింగ్స్ 56, జడేజా 11, బ్రావో 11 పరుగులతో చెన్నై జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు.