బాహుబలికి జాతీయ అవార్డుల పంట
Updated:
13-04-2018 01:06:36
న్యూఢిల్లీ: బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాకు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపిక చేస్తూ 65వ జాతీయ అవార్డుల కమిటీ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్స్ట్ సినిమాగా కూడా అవార్డ్ తెచ్చుకుంది. ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు, బిజెపి ఎంపీ వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఇటీవలే కన్నుమూసిన అగ్ర నటి శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డ్ లభించింది. ఆమె నటించిన మామ్ చిత్రానికి ఈ అవార్డ్ దక్కింది. ఉత్తమ సహాయనటి అవార్డును ఇరాదా సినిమాలో నటించిన దివ్యా దత్తా దక్కించుకుంది. బెస్ట్ హిందీ ఫిల్మ్ అవార్డ్ న్యూటన్‌కు దక్కింది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్‌కు ఆరోసారి జాతీయ అవార్డ్ లభించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీకి అవార్డు దక్కింది. ఈ సినిమాలో రానా నటించారు. ఉత్తమ సింగర్ అవార్డ్ జేసుదాసుకు దక్కింది.